ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం లభించింది. నెల రోజుల తర్వాత కేంద్రం ఈ చట్ట ప్రకారం కీలక చర్యలు తీసుకొంది.
దావూద్, మసూద్లను ఉగ్రవాదులుగా ప్రకటించిన హోంశాఖ - కేంద్ర
జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబయి ఉగ్రదాడి నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఉగ్రవాదులుగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ.
దావూద్, మసూద్‌పై వ్యక్తిగత ఉగ్రవాద ముద్ర
కొత్త చట్టం ప్రకారం.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబయి ఉగ్రదాడి నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని వ్యక్తిగత ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
దావూద్ ఇబ్రహీం, మసూద్ అజార్, హఫీజ్ మహమ్మద్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీలకు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాత్ర ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది.
- ఇదీ చూడండి: అహ్మదాబాద్‌లో 'అభినందన వినాయకుడు'!
Last Updated : Sep 29, 2019, 10:30 AM IST