తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ ఖుదాకా నూర్​ హై.. భారత్​ కా కోహినూర్ హై​' - triple talaq

ముమ్మారు తలాక్​ను వ్యతిరేకించిన ప్రధాని మోదీకి ఉత్తర్​ప్రదేశ్​ ముస్లిం మహిళలు నీరాజనం పలికారు. నినాదాలు, ప్లకార్డులతో మోదీపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. మరోసారి మోదీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

'మోదీ ఖుదాకా నూర్​ హై.. భారత్​ కా కోహినూర్ హై​'

By

Published : Apr 7, 2019, 9:59 PM IST

నరేంద్రమోదీకి మద్దతుగా ముస్లిం మహిళలు

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ముస్లిం మహిళలు ప్రదర్శనలు చేశారు. మోదీ (ఖుదాకా నూర్ హై.. భారత్​ కా కోహినూర్ ​హై) అల్లా ఇచ్చిన కాంతి రేఖ అని, భారత దేశపు కోహినూర్ వజ్రమని ప్లకార్డుల్లో ప్రశంసల వర్షం కురిపించారు. లోక్​సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం వల్లే తమ జీవితాలు మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

"ముమ్మారు తలాక్​ను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారు. ఈ నిర్ణయంతో మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. మోదీ ప్రభుత్వం వల్లే ఈరోజున మా స్థితి మారుతోంది. ప్రధాని మంత్రి అయ్యాక ముమ్మారు తలాక్​ చట్టాన్ని రద్దు చేస్తామని రాహుల్​ అన్నారు. ఆయన ఆలోచన చాలా తప్పు. మాకు బలమైన సర్కారు కావాలి. ఇప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్నాం. కానీ రాహుల్​ గాంధీ మాటలతో మళ్లీ భయపడుతున్నాం."

-హుమ భాను, ముస్లిం మహిళ.

గత ప్రభుత్వాల వల్ల మహిళలకు స్వేచ్ఛ లేదని... మోదీ ప్రభుత్వం వల్లే నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ దొరికిందని అన్నారు. ఇతర మహిళలూ మోదీకే ఓటు వేయాలని అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details