తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రధాని రేసులో ప్రాంతీయ నేతలుంటే సహకరిస్తాం' - ఆజాద్​

సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్​ అవతరిస్తుందని ఆ పార్టీ సీనియర్​ నేత ఆజాద్​ ధీమా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రధాని పదవి రేసులో ప్రాంతీయ పార్టీల నేతలుంటే కాంగ్రెస్​ అభ్యంతరం తెలపదని స్పష్టం చేశారు.

'ప్రధాని రేసులో ప్రాంతీయ నేతలుంటే సహకరిస్తాం'

By

Published : May 17, 2019, 6:47 AM IST

Updated : May 17, 2019, 7:28 AM IST

ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి చూపించే ప్రాంతీయ పార్టీల నేతలకు కాంగ్రెస్​ కచ్చితంగా సహకరిస్తుందని ఆ పార్టీ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా మద్దతిస్తామని తెలిపారు. ప్రధాని పదవి కోసం కాంగ్రెస్​ ప్రాకులడదన్నారు ఆజాద్​.

'మేము సహకరిస్తాం'

"ఈ విషయంపై కాంగ్రెస్​ ముందే స్పష్టతనిచ్చింది. అందరూ అంగీకరించి కాంగ్రెస్​కు నాయకత్వ బాధ్యత అప్పగిస్తే... పార్టీ కచ్చితంగా స్వీకరిస్తుంది. ఎన్​డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే మా ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో మద్దతిచ్చే పార్టీలతో కలిసి కాంగ్రెస్​ ముందడుగు వేస్తుంది. అంతేకాని... మేము ప్రధాని అవ్వకపోతే, ఇంకెవ్వరూ అవ్వకూడదు అని పార్టీ నేతలు అనరు."
--- గులామ్​ నబీ ఆజాద్​, కాంగ్రెస్​ నేత.

ఎన్డీయేతర ప్రభుత్వ స్థాపనలో కాంగ్రెస్​ ముఖ్య పాత్ర పోషించే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఆజాద్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించి... అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆజాద్​ ధీమా వ్యక్తం చేశారు.

మోదీది తుగ్లక్​ పాలన...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనను 14వ శతాబ్దపు తుగ్లక్​ పాలనతో పోల్చారు ఆజాద్​. తుగ్లక్​ లాగే మోదీ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని దేశప్రజలను ఇబ్బందిపెట్టారని ఆరోపించారు. తన వ్యాఖ్యలకు నోట్లరద్దు, జీఎస్​టీలే ఉదాహరణలన్నారు.

ఇదీ చూడండి: భారతీయులకు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం శుభవార్త

Last Updated : May 17, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details