వరుసగా తనకు వచ్చే పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారు అనే కోపంతో పక్కింటి వారిపై పగ తీర్చుకున్నాడు కేరళ కన్నూరుకు చెందిన అల్బిన్ అనే యువకుడు. తన పొరుగున ఉన్న సోజీ దుకాణాన్ని జేసీబీతో నేలమట్టం చేశాడు.
పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని పగ తీర్చుకున్నాడు - Ayyapan and Koshy style revenge at Kannur
సినిమా చూసి ప్రజలు బాగా అప్డేట్ అవుతున్నారు. నిజ జీవితంలో కూడా సినిమా తరహా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. మలయాళ సినిమా అయ్యపనమ్ కోష్యూమ్ లాగే పొరుగింటి వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు.

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని పగ తీర్చుకున్నాడు
అల్బిన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం బయట పెట్టాడు. తనకు వచ్చిన ఐదు పెళ్లి సంబంధాలను లేనిపోని మాటలు చెప్పి సోజి చెడగొట్టాడని చెప్పాడు. అందుకే అతని దుకాణాన్ని జేసీబీతో ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు అల్బిన్.
జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యాలు