తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2020, 6:39 AM IST

Updated : Mar 1, 2020, 4:06 AM IST

ETV Bharat / bharat

పేదలకు చేరువగా వైద్యం-ఆర్థిక సహాయానికై కేంద్రం నిర్ణయం!

ఆయుష్మాన్ భారత్​ పరిధిలోకి రాని వ్యాధులకు రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు అన్ని ఆసుపత్రులు, రాష్ట్రాల ఆరోగ్య శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.

ayushman
వైద్య చికిత్సకు కేంద్రం భరోసా

వైద్య బీమా సౌకర్యం లేని ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు, ఈ పథకంలోకి రాని వ్యాధుల చికిత్స కోసం డబ్బులు అవసరమైన వారికి సహాయం చేసే దిశగా అడుగులు వేసింది కేంద్రం. రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులు చేసిన అభ్యర్థన మేరకు ఆర్థిక సహాయం వైపు కేంద్రం మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆదేశాలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాంతీయ కాన్సర్ వ్యాధి నియంత్రణ కేంద్రాలు, అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య అథారిటీ, ఖజానా శాఖలకు పంపించింది.

"వైద్యులు సూచించిన చికిత్స.. ఆయుష్మాన్ భారత్ కిందకు రాకపోతే రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నాం."

-కేంద్రం ప్రకటన

అయితే ఈ ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. ఆయుష్మాన్ భారత్​ పథకం లోని చికిత్సలు రోగికి వర్తించవన్న ప్రభుత్వ వైద్యుల అభిప్రాయం అనంతరమే రాష్ట్రీయ ఆరోగ్య నిధికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

జన ఆరోగ్య యోజన ద్వారా అందిస్తున్న 1393 వ్యాధి చికిత్సలతో పాటుగా రక్త కాన్సర్, కాలేయ వ్యాధులు, ఎముక మజ్జ మార్పిడి వంటి చికిత్సలకు ఈ సహాయ నిధి ద్వారా సహకారం అందిస్తామని ప్రకటించింది కేంద్రం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కిడ్నీ, ఎముక మజ్జ మార్పిడి వంటి చికిత్సలకు పేదలకు మేలు జరుగుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్​!

Last Updated : Mar 1, 2020, 4:06 AM IST

ABOUT THE AUTHOR

...view details