యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను ఎదుర్కోవడంలో ఆయుర్వేదం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు నిపుణులు. తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి(ఎండు అల్లం), ఎండు ద్రాక్ష వంటివి రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయని వారు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ వ్యక్తులపై దాని దుష్ప్రభావాలు పెద్దగా ఉండకుండా అవి రక్షణ కల్పిస్తాయని వివరించారు. త్వరగా కోలుకునేందుకూ దోహదపడతాయని చెప్పారు. ఆయుర్వేదంతో చేకూరే ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల నొక్కిచెప్పారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన ప్రొటోకాల్‌ను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. ఇవి తింటే చాలు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఈ మహమ్మారిపై పోరాడటంలో ఆయుర్వేదం ఎంతో గొప్పగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. వాటిని తింటే చాలు
ప్రతిరోజూ గోరువెచ్చటి నీరు తాగడంతోపాటు యోగాసనాలు-ధ్యానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఆయుష్ శాఖ అందులో పేర్కొంది. వంటల్లో పసుపు, జీలకర్ర వంటివి వాడాలని.. బెల్లం, తాజా నిమ్మరసం కొవిడ్‌పై పోరుకు దోహదపడతాయని సూచించింది. ఆయుర్వేదం ద్వారా రోగ నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుందని.. తద్వారా కరోనా ముప్పు తగ్గుతుందని సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్త ఎ.కె.ఎస్.రావత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.