తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య ట్రస్టులో సభ్యులుగా అమిత్​ షా, యోగి!'

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేయాల్సిన ట్రస్టులో సభ్యులుగా ఎవరు ఉండాలన్న అంశంపై వీహెచ్​పీ కీలక సూచనలు చేసింది. అమిత్ ​షా, యోగి ఆదిత్యనాథ్​ను చేర్చాలని కోరింది.

'అయోధ్య ట్రస్టులో సభ్యులుగా అమిత్​ షా, యోగి!'

By

Published : Nov 13, 2019, 12:49 PM IST

Updated : Nov 13, 2019, 5:05 PM IST

'అయోధ్య ట్రస్టులో సభ్యులుగా అమిత్​ షా, యోగి!'

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్టు ఏర్పాటుపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆ ట్రస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను సభ్యులుగా చేర్చాలని విశ్వహిందూ పరిషత్​ సిఫార్సు చేసింది. ఇందుకు అవసరమైతే నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. గతంలో సోమ్​నాథ్​ ట్రస్ట్​లో అప్పటి కేంద్ర మంత్రి కేఎం మున్షీని సభ్యునిగా చేర్చడాన్ని వీహెచ్​పీ గుర్తుచేసింది. రామ మందిరం ట్రస్టునూ అదే తరహాలో ఏర్పాటు చేయాలని కోరింది.

రామజన్మభూమి న్యాస్(ఆర్​జేఎన్​)​ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ట్రస్టు గొప్ప ఆలయాన్ని నిర్మిస్తుందని వీహెచ్​పీ ప్రతినిధి శరద్​ శర్మ ఆశాభావం వ్యక్తంచేశారు.

30 ఏళ్లుగా....

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఖాయమన్న ధీమాతో 1990 నుంచి కర్​సేవక్​పురం​లో కార్ఖానా నిర్వహిస్తోంది ఆర్​జేఎన్​. ఎంతో మంది కళాకారులు గడిచిన సంవత్సరాలలో అద్భుత శిల్పాలు, గుడికి అవసరమయ్యే స్తంభాలను చెక్కారు. 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 128 అడుగుల ఎత్తుతో మందిర నిర్మాణానికి ఆర్​జేఎన్ ప్రణాళిక రూపొందించింది. ఆలయ నిర్మాణానికి 212 స్తంభాలు అవసరమవుతాయని అంచనా. ఇప్పుడు ఇదే నమూనా ప్రకారం మందిర నిర్మాణం జరగాలని ఆర్​జేఎన్​, వీహెచ్​పీ ఆశిస్తున్నాయి.

కర్​సేవక్​పురంలో కార్ఖానా మొదలు పెట్టిన దాదాపు 30ఏళ్ల నుంచి రామ మందిర నమూనాను అనేక సమాచార మార్గాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము. వీటిని భక్తులు ఫొటోలు, వీడియోలను తీసుకొని ప్రచారం చేశారు. కాబట్టి ప్రజల దృష్టిలో రామమందిర నిర్మాణంపై ఈ నమూనానే ఊహించుకుంటారు.

-శరద్​ శర్మ, విశ్వహిందూ పరిషత్​ ప్రతినిధి

ఇవీ చూడండి: సివిల్ సర్వీసెస్​ ఫలితాలు విడుదల

Last Updated : Nov 13, 2019, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details