తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో అత్యవసర పరిస్థితుల కోసం హెలికాప్టర్లు - Ayodhya verdict latest update

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అయోధ్య, లఖ్​నవూలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనుంది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. అత్యవసర పరిస్థితులు నెలకొన్న తరుణంలో వీటిని వినియోగిస్తారు. లఖ్​నవూలో రాష్ట్రస్థాయి కంట్రోల్​ విభాగం ఏర్పాటు చేయనుంది.

అయోధ్యలో అత్యవసర పరిస్థితుల కోసం హెలికాప్టర్లు

By

Published : Nov 8, 2019, 5:15 AM IST

Updated : Nov 8, 2019, 7:33 AM IST

అయోధ్యలో అత్యవసర పరిస్థితుల కోసం హెలికాప్టర్లు

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు చేపట్టింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఈ చర్యల్లో భాగంగా లఖ్​నవూ, అయోధ్యలో అత్యవసర పరిస్థితుల కోసం రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.

తీర్పు నేపథ్యంలో ఏదైన అత్యవసర పరిస్థితి నెలకొన్న తరుణంలో ఈ హెలికాప్టర్లను వినియోగిస్తారు.

రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు, పోలీసులు, డివిజనల్​ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లతో గురవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ముఖ్యమంత్రి​. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్షించారు. సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లఖ్​నవూలో కంట్రోల్​ రూం..

తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. లఖ్​నవూ నగరంలో రాష్ట్రస్థాయి కంట్రోల్​ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా కంట్రోల్​ రూం ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పు ముందు రైల్వే స్టేషన్లు అలర్ట్​

Last Updated : Nov 8, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details