తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్: మోదీ - మోదీ తాజా వార్తలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి లోక్​సభలో కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్రమోదీ. సుప్రీం ఆదేశాల మేరకు ట్రస్ట్​ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సున్నీ వక్ఫ్​ బోర్డుకు ఐదెకరాల భూమిని ఇచ్చేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

Modi
Modi

By

Published : Feb 5, 2020, 12:20 PM IST

Updated : Feb 29, 2020, 6:26 AM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. అనంతరం నేరుగా లోక్​సభకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. ప్రశ్నోత్తరాల సమయానికి ముందు రామమందిరానికి సంబంధించి ప్రకటన చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ

"కోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో పాటు.. మిగిలిన అంశాలకు సంబంధించి ఒక పథకాన్ని మా ప్రభుత్వం రూపొందించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్​ను ఏర్పాటు చేశాం. ఈ ట్రస్ట్​.. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, ఇతర విషయాలపై పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. "

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమి సేకరణపై స్పష్టతనిచ్చారు మోదీ. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సున్నీ వక్ఫ్​ బోర్డుకు ఐదెకరాల భూమిని ఇచ్చేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

Last Updated : Feb 29, 2020, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details