చారిత్రక అయోధ్య నగరంలో ప్రదర్శితమవుతోన్న 'రామ్‌లీలా' నాటక వీక్షకుల సంఖ్య పదికోట్ల మార్క్‌ను దాటింది. టీవీ, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కల్పించడం వల్లే ఇన్ని వ్యూస్ వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉర్దూ సహా మొత్తం 14 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమవుతోన్న ఈ నాటకం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నదీ ఒడ్డున లక్ష్మణ ఖిలాలో ఈ నెల 17న ప్రారంభమైంది.
ఏటా దసరా పండుగ సందర్భంగా భక్తులను ఆకట్టుకునే ఈ నాటక ప్రదర్శనను కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ నాటకాన్ని దూరదర్శన్, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు.