తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామాలయ మ్యాప్​నకు ఏడీఏ ఆమోదం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన మ్యాప్​ను అయోధ్య అభివృద్ధి సంస్థ(ఏడీఏ) ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడైనా ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

Ayodhya Ram temple map Unanimously passed by ADA
రామాలయ మ్యాప్​నకు ఏడీఏ ఆమోదం

By

Published : Sep 2, 2020, 4:26 PM IST

అయోధ్యలో రామాలయానికి సంబంధించిన మ్యాప్​నకు అయోధ్య అభివృద్ధి సంస్థ (ఏడీఏ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవ అంగీకారం లభించింది. ఫలితంగా రామాలయం నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు పొందినట్లైంది. 13 వేల చదరపు మీటర్లలో ఆలయ నిర్మాణం జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

రామాలయ మ్యాప్​ అనుమతి కోసం అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 29న ఏడీఏకు సమర్పించారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్​ మిశ్రా. ఈ ప్రక్రియ పూర్తికావడం వల్ల మందిర నిర్మాణాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు.

ఇదీ చూడండి:'కర్మయోగి మిషన్'​కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details