తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామ మందిర నిర్మాణంలో మరో అడుగు - ఆదిత్యనాథ్​ ఆధ్వర్యంలో రాముని విగ్రహం తరలింపు

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జోరందుకున్నాయి. తాత్కాలిక మందిరం నుంచి రాముని విగ్రహాన్ని మరొక చోటుకు తరలించారు అధికారులు. నిర్మాణం పూర్తయ్యాక అదే చోట పునఃప్రతిష్ఠించనున్నారు.

Ayodhya: Ram Lalla idol shifted to temporary structure to allow temple construction
ఆదిత్యనాథ్​ ఆధ్వర్యంలో రాముని విగ్రహం తరలింపు

By

Published : Mar 25, 2020, 12:59 PM IST

Updated : Mar 25, 2020, 4:47 PM IST

అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రదేశం నుంచి రాముడి విగ్రహాన్ని తాత్కాలికంగా మరొక చోటుకు తరలించారు. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి.

ఈ విగ్రహాన్ని 9.5 కిలోల వెండి సింహాసనంపై పెట్టారు. రామ మందిర నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగిన తర్వాత ఈ ప్రతిమను ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు.

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు ఎవరినీ ఆహ్వనించలేదు. ఆర్​ఎస్​ఎస్​ సీనియర్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్​కు చెందిన వారు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా 'సామాజిక దూరం' నిబంధనలు ఉల్లంఘించారని యోగి ఆదిత్యనాథ్​పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఇదీ చూడండి:- 'పొరపాటు జరిగింది... ఆయన మృతికి కరోనా కారణం కాదు
'

Last Updated : Mar 25, 2020, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details