ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని నందిగ్రామ్ ఏడాదికాలంగా రామనామ స్మరణలతో మారుమోగుతోంది. ఇలాగే మరో 13 ఏళ్లపాటు శ్రీరామ సంకీర్తనలతో పరిమళించనుంది.
ఏడాది దాటినా...
నందిగ్రామ్‌లో 2018 అక్టోబర్ 14న రామకీర్తనలను ప్రారంభించారు శ్రీ రామజానకి ఆలయ నిర్వహకులు. అప్పటి నుంచి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో 24 గంటలపాటు నిరంతరాయంగా రామ కీర్తనలు ఆలపిస్తున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తి చేసుకున్న ఈ రామ్ నామ్ సంకీర్తన్ మరో 13 ఏళ్ల పాటు అంటే 2032 వరకు కొనసాగుతుందని చెబుతున్నారు నిర్వహకులు.
"ఇక్కడ 14 ఏళ్ల పాటు సీతారాములవారి సంకీర్తనలు నడుస్తాయి. లోకకల్యాణం కోసం, ప్రజలను ధర్మంతో కలిపేందుకు 24 గంటలు ఇలా రామ కీర్తనలు ఆలపిస్తున్నాం. ఈ అఖండ్ రామ్ నామ్ సంకీర్తనలను నిరంతరాయంగా కొనసాగించేందుకు 365 జట్లు ఏర్పడ్డాయి."
-భవానీ పాండే, నిర్వహకుడు