తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాబా స్తూపం ఆకృతిలో అయోధ్య మసీదు - Makka mosque news

అయోధ్యలో నిర్మించనున్న మసీదును మక్కా మసీదులోని కాబా స్తూపం తరహాలో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మసీదుకు బాబ్రీ పేరును కానీ, ఇతర ఏ చక్రవర్తి పేరును కానీ పెట్టే ఉద్దేశం లేదని ఇండో-ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​(ఐఐసీఎఫ్​) కార్యదర్శి అథర్​ హుస్సేన్​ పేర్కొన్నారు.

Ayodhya Mosque in the shape of Kaaba Stupa
కాబా స్తూపం ఆకృతిలో అయోధ్య మసీదు

By

Published : Sep 21, 2020, 8:45 AM IST

పవిత్ర మక్కా మసీదులోని కాబా స్తూపం తరహాలో అయోధ్యలో మసీదు నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంప్రదాయ మసీదులకు భిన్నంగా కాబా స్తూపం చదరపు ఆకారంలో ఉంటుంది. అయోధ్యలో మసీదు ఆకృతి విషయంలోనూ దాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మసీదుకు బాబ్రీ పేరును కానీ, ఇతర ఏ చక్రవర్తి పేరును కానీ పెట్టే ఉద్దేశం లేదని ఇండో-ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​(ఐఐసీఎఫ్​) కార్యదర్శి అథర్​ హుస్సేన్​ పేర్కొన్నారు.

"ధన్నిపుర్​ గ్రామంలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మిస్తాం. బాబ్రీ మసీదుతో సమానమైన విస్తీర్ణంలోనే ఇది ఉంటుంది. అయితే దీని ఆకృతి మాత్రం ఇతర సంప్రదాయ మసీదులకు భిన్నంగా ఉండొచ్చు. వాస్తు శిల్పి ఎస్​.ఎం.అక్తర్​ చెప్పిన దాని ప్రకారం అది కాబా స్తూపం ఆకారంలో, గోపురాలు లేదా మినార్లు లేకుండా ఉండొచ్చు."

ABOUT THE AUTHOR

...view details