తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసు తీర్పు వచ్చేది ఆ రోజే..! - జాతీయ తాజా వార్తలు

సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ సాగిన అయోధ్య భూవివాదం కేసులో వచ్చే నెల తీర్పు వెలువడే అవకాశం ఉంది. నేటితో వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పును వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

Ayodhya matter

By

Published : Oct 16, 2019, 6:38 PM IST

Updated : Oct 16, 2019, 9:04 PM IST

అయోధ్య కేసు తీర్పు వచ్చేది ఆ రోజే..!

దశాబ్దాల నాటి అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో నేటితో వాదనలు ముగిశాయి. అభ్యంతరాల సమర్పించేందుకు గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఏళ్లనాటి భూవివాదంలో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నవంబర్​ 17న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి పదవీ విరమణ ఉండటం వల్ల ఆ లోపే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నవంబర్​ 4 నుంచి 17 మధ్య సుప్రీం తన నిర్ణయం ప్రకటిస్తుందని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు.

"అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. వివాదంపై తర్వలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 23 రోజుల్లోపు తీర్పునిస్తామని తెలిపింది. "

-వరుణ్ సిన్హా, హిందూ మహాసభ తరఫు న్యాయవాది

రెండో సుదీర్ఘ విచారణ

సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం విచారణ జరిగిన రెండో కేసుగా అయోధ్య భూవివాదం నిలిచింది. గతంలో 1972లో 'కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం' కేసులో 68 రోజుల పాటు విచారణ సాగింది. ప్రాథమిక హక్కుల అంశంపై 13 మంది న్యాయమూర్తులు వాదనలు విన్నారు.

ఆ తర్వాత ఇప్పటివరకు రెండో స్థానంలో 38 రోజుల విచారణతో ఆధార్ కేసు ఉండేది. 40 రోజుల పాటు సాగిన విచారణతో ఆ రికార్డును అయోధ్య భూవివాదం అధిగమించింది.

ఇదీ చూడండి: అయోధ్య కేసు విచారణ సమాప్తం- తీర్పుపై ఉత్కంఠ

Last Updated : Oct 16, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details