తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర భూమిపూజ కోసం 1,11,000 లడ్డూలు - Ram Mandir bhumi puja news

ఆగస్టు 5న అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం 1,11,000 లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సహా.. మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు.

Ayodhya : Making 1,11,000 laddoo for Ram Mandir bhumi puja
రామమందిర భూమి పూజకోసం 1,11,000 లడ్డూలు!

By

Published : Jul 31, 2020, 4:47 PM IST

అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం లక్షా 11 వేల లడ్డులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మణిరాం దాస్ ఛావ్ నీ అనే వ్యక్తి ఈ లడ్డూలను తయారు చేస్తున్నారని వెల్లడించారు.

రామమందిర భూమి పూజకోసం 1,11,000 లడ్డూలు!

ఆగస్టు 5న జరిగే వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సహా సుమారు 200 మంది అతిథులు హాజరు కానున్నారు.

రామమందిర భూమి పూజకోసం 1,11,000 లడ్డూలు!

4 లక్షల లడ్డూలకు ఆర్డర్​..

దిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

రామమందిర భూమి పూజకోసం 1,11,000 లడ్డూలు!
రామమందిర భూమి పూజకోసం 1,11,000 లడ్డూలు!

32 సెకన్లలో పూర్తయ్యేలా..

ఆగస్టు 3న గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్న ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా.. ఆగస్టు 5న గర్భగుడిలో జరిగే కార్యక్రమంలో 11 మంది పాల్గొంటారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో శంకుస్థాపన జరిగేలా ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం అయోధ్య ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

రామమందిర భూమి పూజకోసం 1,11,000 లడ్డూలు!

ఇదీ చదవండి:రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు

ABOUT THE AUTHOR

...view details