తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకు 'అయోధ్య' మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక - mediation panel

అయోధ్య అంశంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సీల్డ్​కవర్​లో సమర్పించింది. రేపటి నుంచి కేసు విచారణను జరపనుంది సర్వోన్నత న్యాయస్థానం. అయోధ్య కేసుపై రోజు వారీ విచారణ జరపాలా.. వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

సుప్రీంకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక

By

Published : Aug 1, 2019, 4:07 PM IST

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించింది. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసింది. పరిశీలన అంశాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​కు సీల్డ్​ కవర్​లో అందజేశారు కమిటీ సభ్యులు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం రేపటి నుంచి నివేదికపై విచారణ ప్రారంభించనుంది.

వివాదాస్పద భూమిపై కేసు...

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

'మధ్యవర్తిత్వమే మార్గం...'

మార్చి 8న ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​

ABOUT THE AUTHOR

...view details