'రామ్ నామ్ బ్యాంక్'... ఉత్తర్‌ప్రదేశ్ అలహాబాద్‌లోని ఓ బ్యాంక్. అయితే ఈ బ్యాంక్ ఏటీఎమ్ కార్డ్‌లు, పాస్‌బుక్‌లు ఇవ్వదు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వీళ్లు డబ్బు జమ చేసుకోరు. వీళ్లు డిపాజిట్ చేసుకునేది.. కేవలం 'రామ'నామం. ఈ బ్యాంకు ఖాతాదారులు రామనామం రాసిన బుక్లెట్లను ఇక్కడ డిపాజిట్ చేస్తారు.
అయోధ్య తీర్పుతో ఈ బ్యాంకు తమ ఖాతాదారుల్లో లక్ష మందికి బోనస్ ప్రకటించింది. నవంబర్ 9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఈ అవార్డ్ ఇవ్వనుంది.
ఇదే బోనస్...
ఇక్కడ బోనస్ ఏంటంటే... ఖాతాదారులు చేతితో రాసిన, టైప్ చేసిన, మొబైల్ యాప్‌లో టైప్ చేసిన ఒక్కొక్క రామనామాన్ని రెండుగా పరిగణిస్తారు. ఈ బోనస్ గురించి రామనామ సేవా సంస్థానం ఛైర్మన్ వివరించారు.
"ఉదాహరణకు ఒక భక్తుడు ఒకసారి రామనామాన్ని రాస్తే దాన్ని.. రెండుగా పరిగణిస్తాం. ఇందుకోసం కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రచించి ఉండాలి. అలా రాసిన ఖాతాదారులకు ఈ అవార్డ్ దక్కుతుంది. నవంబర్ 10న ఈ బోనస్ ప్రకటించాం."
-అశుతోష్ వార్ణ్షే, రామ నామ సేవా సంస్థానం ఛైర్మన్
బుక్లెట్...