తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసులో నేటినుంచి రోజువారీ విచారణ

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు నేటినుంచి రోజువారీ విచారణ చేపట్టనుంది. మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా సమస్య పరిష్కారానికి చేసిన యత్నాలు విఫలమయ్యాయని తెలిపింది. ఆగస్టు1న కమిటీ నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి సీల్డ్​కవర్​లో సమర్పించిన అనంతరం.. ఈ నిర్ణయం తీసుకున్నారు సీజేఐ.

అయోధ్య కేసులో నేటినుంచి రోజువారీ విచారణ

By

Published : Aug 6, 2019, 5:31 AM IST

Updated : Aug 6, 2019, 7:34 AM IST

అయోధ్య కేసులో నేటినుంచి రోజువారీ విచారణ

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ నేటినుంచి ప్రారంభం కానుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య అంశంపై విచారణ చేపట్టనుంది.

కమిటీ విఫలం...

అయోధ్య వివాదంలో రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగించి పరిష్కారం కనుగొనడం కోసం మార్చి 8న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులు.

ఆగస్టు 1న నివేదికను సమర్పించాల్సిందిగా జులై 18న మధ్యవర్తిత్వ కమిటీని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. అనంతరం... గురువారం సీల్డ్​కవర్​లో నివేదికను సమర్పించారు సభ్యులు. మరుసటి రోజు నివేదిక పరిశీలించింది కోర్టు. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా.. ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొంది.

వివాదాస్పద భూమిపై కేసు...

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి:

కశ్మీర్ డైరీ​: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా

Last Updated : Aug 6, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details