తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసు: సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే.. - ayodhya ram temple

అతి సున్నితమైన అయోధ్య కేసులో తీర్పును వెలవరించింది సుప్రీంకోర్టు. అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయోధ్య కేసు: సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే...రాముడిదే అయోధ్య

By

Published : Nov 9, 2019, 3:48 PM IST

సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే

రాముడిదే అయోధ్య...

  • అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.
  • అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించిన సుప్రీంకోర్టు.
  • ఏకగ్రీవ తీర్పు చెప్పిన ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం.
  • మందిర నిర్మాణం కోసం 3 నెలల్లోపు ట్రస్టు ఏర్పాటు చేయాలి. ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలి.

ధర్మకర్తల మండలి ఏర్పాటు

  • రామమందిర నిర్మాణం, స్థలబదిలీ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.
  • ట్రస్ట్ ఏర్పాటు, విధివిధినాలను 3 నెలల్లోపు కేంద్రం పూర్తి చేయాలి.
  • ట్రస్ట్ బోర్డులో నిర్మోహి అఖాడాకు ప్రాతినిధ్యం కల్పించాలి.

రాముడి హక్కులు

  • వివాదాస్పద స్థలంపై రాముడి హక్కులు.. మతసామరస్యం, శాంతిభద్రతలకు లోబడి ఉంటాయి.
  • శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య అన్న హిందువుల విశ్వాసం వివాదరహితం.
  • రామజన్మభూమి అనేది న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కాని రాముడు కక్షిదారుడే.
  • రాముడు అయోధ్యలో పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు.

సుప్రీం తీర్పు

  • 1934లో మసీదుకు జరిగిన నష్టం, 1949లో అగౌరవపరచడం, 1992లో కూల్చివేత అన్నీ చట్ట ఉల్లంఘనే. జరిగిన పొరపాట్లను సరిదిద్దాలి.
  • వివాదాస్పద ప్రదేశంలోని ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెప్తున్నాయి.
  • వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లామ్‌ మూలాలు లేవు. స్థలం తమ అధీనంలో ఉందని సున్నీ వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయింది.
  • 1949 తర్వాత స్థలం తమ అధీనంలో ఉన్నట్టు లేదా ప్రార్థనలు చేస్తున్నట్టు ముస్లింలు నిరూపించలేదు.
  • చుట్టుపక్కల స్థలం కూడా ముస్లింల అధీనంలో లేదు. వివాదాస్పద స్థలంపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు ముస్లింలు నిరూపించలేకపోయారు.
  • 1857కు ముందు నుంచే ఈ ప్రాంతం హిందువులు సందర్శించారనేదానికి ఆధారాలున్నాయి.
  • 1856కు ముందు వరకు హిందువులు లోనికి వెళ్లడంపై ఎటువంటి నిషేధం లేదు.
  • 1857 అల్లర్ల తర్వాత రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రాంగణం లోపలి స్థలం హిందువుల అధీనంలో ఉంది.

ఇదీ చూడండి:'సుప్రీం తీర్పు పట్ల ముస్లింలు సంతోషంగా ఉన్నారు'

ABOUT THE AUTHOR

...view details