తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ' ఐదు ఎకరాల భూమిని తీసుకుంటాం: సున్నీ వక్ఫ్​బోర్డు - Sunni Waqf Board accepts alternative five-acre land near ayodhya

సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును అనుసరించి ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం మసీదు నిర్మాణం కోసం కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరస్కరించే అవకాశం లేదని యూపీ సున్నీ వక్ఫ్​బోర్డు తెలిపింది. సోమవారం జరిగే సమావేశంలో ఆ ప్రత్యామ్నాయ భూమిని ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

Sunni Waqf Board accepts alternative five-acre land near ayodhya
'ఆ' ఐదు ఎకరాల భూమిని తీసుకుంటాం: సున్నీ వక్ఫ్​బోర్డు

By

Published : Feb 22, 2020, 6:05 AM IST

Updated : Mar 2, 2020, 3:36 AM IST

'ఆ' ఐదు ఎకరాల భూమిని తీసుకుంటాం: సున్నీ వక్ఫ్​బోర్డు

సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు ప్రకారం తమకు వచ్చిన 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని తిరస్కరించే అవకాశం లేదని ఉత్తర్​ప్రదేశ్​ సున్నీ సెంట్రల్ వక్ఫ్​బోర్డు తెలిపింది. సోమవారం సమావేశమై.. ఆ భూమిని ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

చారిత్రక తీర్పు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు 2019 నవంబర్​లో... రామాలయ నిర్మాణానికి అనుకూలంగా చారిత్రక తీర్పు వెలువరించింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది.

సుప్రీం ఆదేశం మేరకు ఐదు ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు కేటాయించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఫలితంగా రాష్ట్రమంత్రివర్గం ఫిబ్రవరి 5న సమావేశమై ఈ కేటాయింపు చేసింది.

కోర్టు ధిక్కారానికి సమానం.

సుప్రీం తీర్పు అనంతరం ప్రత్యామ్నాయ భూమిని అంగీకరించకూడదని పలు ముస్లిం వర్గాలు సున్నీ బోర్డుకు సూచించాయి.

"సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఇస్తామన్న ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని తిరస్కరించే అవకాశం సున్నీ బోర్డుకు లేదు. ఎందుకంటే ఇది కోర్టు ధిక్కారానికి సమానం. మేము ఈ అంశంపై సుప్రీం తీర్పుకే కట్టుబడి ఉంటామని మొదటి నుంచీ చెబుతున్నాం. అందుకే అయోధ్య తీర్పుపై సమీక్ష పిటిషన్​ కూడా వేయలేదు. ఇప్పటికీ మా నిర్ణయంలో ఎటువంటి మార్పులేదు. "- ఫరూకీ, సున్నీ వక్ఫ్​ బోర్డు సభ్యుడు.

మాకు ఆ స్వేచ్ఛ ఉంది..

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్​బోర్డుకు ఒక స్థలం కేటాయిస్తుందని... సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నట్లు ఫరూకీ తెలిపారు. దానిపై మసీదు, అనుబంధ నిర్మాణాలు చేపట్టడానికి తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.

యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్​బోర్డులో ఫరూకీతోపాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

ధన్నిపుర్​లో

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఈ నెల ఆరంభంలో అయోధ్య సోహావాల్​ తహసీల్​లోని ధన్నిపుర్​ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సున్నీబోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇది జిల్లా కేంద్రం నుంచి 20కి.మీ దూరంలో ఉన్న అయోధ్య-లఖ్​నవూ రహదారి పక్కన ఉంది.

ఇదీ చూడండి:జియో నుంచి లాంగ్‌టర్మ్‌ ప్రీపెయిడ్​ ప్లాన్‌

Last Updated : Mar 2, 2020, 3:36 AM IST

ABOUT THE AUTHOR

...view details