రాజకీయంగా అత్యంత సున్నితమైన రామజన్మభూమి- బాబ్రీమసీదు భూ వివాదం కేసులో ఈనెల 17నాటికి వాదనలు ముగించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నెల 17తో అయోధ్య కేసు విచారణ పూర్తి: సుప్రీం - 17 వరకే విచారణ
ఆయోధ్య కేసు విచారణ ఈ నెల 17తో ముగించనున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. మధ్యవర్తుల కమిటీ నివేదిక అనంతరం రోజువారి విచారణ జరుపుతున్న అత్యన్నత న్యాయస్థానం తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
సుప్రీం కోర్టు
ఇంతకుముందు ఈనెల 18నాటికి వాదనలు పూర్తి చేయనున్నట్లు ప్రకటించిన అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా ఒకరోజు ముందుగానే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. మధ్యవర్తుల కమిటీ నివేదిక తర్వాత అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రోజువారి విచారణ జరుపుతోంది.