అయోధ్య భూవివాదంపై 7వ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం రామ్‌లల్లా తరఫు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. వివాదాస్పద అయోధ్య భూమి వద్ద ఉన్న స్తంభాలపై అనేక హిందూ దేవతల చిత్రాలున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు వైద్యనాథన్.
'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు' - విచారణ
వివాదాస్పద అయోధ్య కేసుపై 7వ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయోధ్య వివాదాస్పద భూమిలో ఉన్న స్తంభాలపై హిందూ దేవతల చిత్రాలున్నాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు రామ్‌లల్లా తరఫు న్యాయవాది. భూమిని పరీక్షించడానికి కోర్టు నియమించిన కమిషనర్ అందించిన నివేదిక ద్వారా ఇది స్పష్టమవుతోందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.
'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలు'
వివాదాస్పద భూమిని పరీక్షించిన అనంతరం కమిషనర్ అందించిన నివేదికను ధర్మాసనానికి చదివి వినిపించారు వైద్యనాథన్. కోర్టు నియమించిన కమిషనర్ ఏప్రిల్ 16, 1950లో భూమిని పరీక్షించారు. అక్కడి స్తంభాలపై దేవతల చిత్రాలు ఉన్నాయని కమిషనర్ తన నివేదికలో పేర్కొన్నట్టు న్యాయవాది తెలిపారు. ఇలాంటివేవీ మసీదుల్లో కనపడే ఆస్కారం లేదని వైద్యనాథన్ వివరించారు.
ఇదీ చూడండి:- అత్తివరధర్ ఆలయానికి కోటి మంది భక్తులు!
Last Updated : Sep 27, 2019, 4:41 AM IST