అయోధ్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో వాదనలు పూర్తి కానున్నాయి. కొద్ది రోజుల్లో తీర్పు వెలువడే అవకాశముంది.
అయోధ్య లైవ్: సుప్రీంలో హైడ్రామా- దస్త్రాలు చించేసిన న్యాయవాది
15:05 October 16
మరికొద్ది గంటల్లో...
13:33 October 16
ఆయోధ్య వాదనలకు భోజన విరామం
అయోధ్య కేసు వాదనలు వాడీవేడిగా సాగుతున్న సమయంలో భోజన విరామాన్ని తీసుకుంది సుప్రీం ధర్మాసనం.
హైడ్రామా
అయోధ్య కేసు వాదనల సమయంలో సుప్రీంకోర్టులో హైడ్రామా జరిగింది. ముస్లీంల తరఫున వాదనలు వినిపిస్తున్న రాజీవ్ ధావన్... హిందువుల తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను చింపివేశారు.
అయోధ్యలో వివాదాస్పద 2.77ఎకరాల భూమి సన్నీ వక్ఫ్ బోర్డుకే చెందుతుందని ఆధారాలను రాజీవ్ ధావన్ కోర్టుకు చూపే సమయంలో... హిందుమహాసభ తరఫున వాదనలు వినిపిస్తున్న సీఎస్ వైద్యనాథన్ లేచి ఆ భూమి హిందువులకు చెందుతుందని కొన్ని మ్యాప్‌లు, పుస్తకాన్ని రాజీవ్‌కు ఇచ్చారు. అవి మాజీ ఐఏఎస్ అధికారి కే.కిషోర్ ప్రచురణలని ఆగ్రహంతో వాటిని చింపివేశారు రాజీవ్. 1986లో ముద్రించిన పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దని అభ్యంతరం తెలిపారు.
అంతకుముందు హిందుమహాసభ న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్నారు రాజీవ్.
సీజేఐ ఆగ్రహం
వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆగ్రహానికి గురయ్యారు. వాదనలు ఈ రకంగా కొనసాగితే ఇక్కడి నుంచి లేచి వెళ్లిపోవడమే మేలని వ్యాఖ్యానించారు.
13:16 October 16
- అయోధ్య కేసు విచారణలో అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- మాజీ ఐపీఎస్ కిశోర్ రాసిన పుస్తకాన్ని కోర్టు ముందుంచిన న్యాయవాది వికాస్ సింగ్
- అయోధ్య రీవిజిటెడ్ పేరుతో పుస్తకం రాసిన మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్
- హిందూ మహాసభ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టు ముందుంచిన పుస్తకం, మ్యాప్ చించివేత
- పుస్తకం, మ్యాప్ చింపిన సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్
- 1986లో ముద్రించిన పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దంటూ ధావన్ అభ్యంతరం
- వికాస్ సింగ్ వాదిస్తున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్న ధావన్
- అసహనం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్
- ఇదే విధంగా వాదనలు కొనసాగిస్తే ఇప్పుడే వెళ్లిపోతామన్న ప్రధాన న్యాయమూర్తి
11:14 October 16
'ఇక చాలు'
హిందూ మహాసభ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగింది చాలని... సాయంత్రం 5గంటల వరకు అయోధ్య కేసు వాదనలు పూర్తవుతాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు.
10:58 October 16
40వ రోజు విచారణ ప్రారంభం
- సుప్రీంకోర్టులో 40వ రోజు అయోధ్య కేసు విచారణ
- సుప్రీంకోర్టులో నేటితో అయోధ్య భూ వివాద కేసు విచారణ ముగిసే అవకాశం
- సాయంత్రం 5 వరకు వాదనలు ముగించాలని మరోసారి స్పష్టం చేసిన సీజేఐ
10:28 October 16
ఈరోజే చివరి విచారణ!
ఆయోధ్య కేసు విచారణను తొలుత అక్టోబర్ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. హిందూ, ముస్లిం వర్గాలు.. ఎదుటి పక్షాల వాదనలపై తమ తమ తుది అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చే అవకాశముంది.
09:28 October 16
సుప్రీంలో 40వరోజు 'అయోధ్య' వాదనలు..
సుప్రీంకోర్టులో అయోధ్య భూ వివాద కేసు 40వ రోజు విచారణ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ రోజుతో కేసు విచారణ పూర్తికానుందన్న సంకేతాలు రావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వాదనలు పూర్తి చేసేందుకు పిటిషనర్లకు సాయంత్రం వరకు గడువు విధించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. ఎదుటి పక్షాల వాదనలపై తుది వాదనలకు 45 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. ముస్లిం కక్షిదారులకు గంట సమయమిచ్చారు. వాదనలు ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసే అవకాశాలున్నాయి.