తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పుపై హిందూ సంస్థ రివ్యూ పిటిషన్​

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై నేడు రెండు పునఃసమీక్ష పిటిషన్లు దాఖలయ్యాయి. సున్నీ వక్ఫ్​బోర్డ్​కు 5 ఎకరాల భూమిని కేటాయించడానికి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసింది అఖిల భారత హిందూ మహాసభ.

By

Published : Dec 9, 2019, 10:46 PM IST

Updated : Dec 10, 2019, 7:21 AM IST

Ayodhya case
అయోధ్య కేసులో మరో రెండు రివ్యూ పిటిషన్లు

అయోధ్యలో మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్​బోర్డుకు ఐదెకరాల భూమిని కేటాయిస్తూ వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్​ దాఖలు చేసింది అఖిల భారత హిందూ మహాసభ. సర్వోన్నత న్యాయస్థానం నవంబర్​ 9న ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన తొలి హిందూ సంస్థ ఇదే.

వివాదాస్పద నిర్మాణాన్ని మసీదుగా ప్రకటించే అంశాన్ని తొలగించాలని తన వ్యాజ్యంలో పేర్కొంది. అక్కడ ఉన్నది మసీదు అని నిరూపించటంలో ముస్లింలు విఫలమయ్యారని పేర్కొంది. దానిపై ఎలాంటి హక్కులు వారికి లేవని.. అందువల్ల వారికి ఐదెకరాల భూమి కేటాయించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపింది.

మరో పిటిషన్​..

అయోధ్య కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ.. 40 మంది మానవ హక్కుల కార్యకర్తలు సంయుక్తంగా పిటిషన్​ దాఖలు చేశారు. ఈ తీర్పులో వాస్తవికత, చట్టంలో తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.

డిసెంబర్​ 2న తొలి పిటిషన్​..

అయోధ్య భూవివాదం కేసుపై డిసెంబర్​ 2 తొలి పునఃసమీక్ష పిటిషన్​ దాఖలైంది. అనంతరం ఈనెల 6న.. ఒకే రోజు 6 రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి ముస్లిం సంస్థలు. అందులో అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉంది.

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని నవంబర్​ 9న చారిత్రక తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అయితే.. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కక్షిదారులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 7 రివ్యూ పిటిషన్లు దాఖలు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి: మానవ అభివృద్ధి సూచీలో భారత్​ స్థానం 129

Last Updated : Dec 10, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details