ఆది నుంచి అయోధ్య వివాదం అంతా భూ యాజమాన్య హక్కు చుట్టూనే తిరిగింది. బాబ్రీ మసీదు నిర్మించిన 2.77 ఎకరాల భూమి తమదంటే.. తమదంటూ ఇరువర్గాలూ వాదించుకుని కోర్టులకెక్కాయి. అందులోనూ 1500 గజాల భూమే అత్యంత కీలకంగా మారి, వివాదం అంతా దానిపైనే కేంద్రీకృతమైంది. ఓసారి తేదీలతో ఆ వివాదాన్ని పరిశీలిద్దాం...
ఇలా సాగింది...
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ ఒక మసీదును నిర్మించారు. బాబర్ పేరు మీద ఆ ప్రార్థనా స్థలాన్ని బాబ్రీ మసీదుగా పిలుస్తున్నారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న రామ మందిరాన్ని నేలకూల్చి ఈ మసీదును నిర్మించారని హిందుత్వవాదులు నమ్ముతున్నారు. అది రాముడి జన్మస్థలమని వాదిస్తున్నారు.
- 1859లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఒక కంచెను నిర్మించి, ఆ చోటును రెండు భాగాలుగా చేసింది. ప్రార్థనాస్థలంలోని లోపలి భాగంలో ముస్లింలు, వెలుపలి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసింది.
- మసీదు వెలుపల నిర్మించిన వేదిక (రామ్ ఛబుత్ర)పైన ఒక మండపాన్ని నిర్మించేందుకు అనుమతించాలని 1885లో మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.
- 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలు కనిపించాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి. రెండు పక్షాలూ కోర్టును ఆశ్రయించాయి. మొత్తమ్మీద 2.77 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది.
- డిసెంబర్ 5, 1950న వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ పరంహంస్ రామచంద్ర దాస్ కోర్టులో పిటిషన్ వేశారు.
- జనవరి 16, 1950న రామ్ లల్లాను పూజించే హక్కులు ఇవ్వాలని గోపాల్ సింగ్ విషారథ్ అనే వ్యక్తి ఫైజాబాద్ జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు.
- డిసెంబర్ 18, 1961న వివాదాస్పద స్థలంపై సర్వహక్కులు తమకే ఉన్నాయని ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది.
- 1989లో బాబ్రీ మసీదు పక్క స్థలంలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషద్ (వీహెచ్‌పీ) శంకుస్థాపన చేసింది. మసీదును వేరే చోటుకు మార్చాలని వీహెచ్‌పీ నేత దేవకీ నందన్ అగర్వాల్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో అయోధ్య స్థల యాజమాన్యంపై అప్పటివరకూ దాఖలైన నాలుగు పిటిషన్లు అలహాబాద్ హైకోర్టులోని ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.
- జులై 1, 1989న భగవాన్ రామ్ లల్లా విరాజ్మాన్ పేరిట ఐదో పిటిషన్ దాఖలైంది.
- 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును 'కరసేవకులు' కూల్చివేశారు.
- 2002 ఏప్రిల్‌లో త్రిసభ్య ధర్మాసనం నేతృత్వంలో వివాదాస్పద స్థలంపై వాదనలు ప్రారంభమయ్యాయి.
కీలక తీర్పు...