దేశవ్యాప్తంగా మే 1 నుంచి 60లక్షల వలస కార్మికులను శ్రామిక్ రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు చేర్చినట్లు తెలిపింది రైల్వే శాఖ. వారి నుంచి సగటున రూ. 600 వసూలు చేయగా... మొత్తం 360 కోట్ల రూపాయల ఆదాయం అర్జించినట్లు స్పష్టం చేసింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,450 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.
శ్రామిక్ ప్రత్యేక రైళ్ల సగటు ఛార్జీలు ఒక్కొక్క ప్రయాణికుడికి రూ. 600. ఇవి సాధారణ ఛార్జీలే కానీ ప్రత్యేక రైళ్లల్లో వసూలు చేసే ఛార్జీలు కాదని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటివరకు 60లక్షల మంది ప్రయాణికులను తరలించాము. వారిని తరలించడానికి అయిన ఖర్చులో 15 శాతం మాత్రమే తిరిగి పొందగలిగాము.