తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాఖీ పండుగనాడు.. ఇతని ఆటోలో ప్రయాణం ఉచితం - రాఖీ పండుగ

రక్షాబంధన్ అంటే సోదరీ, సోదరులకు బంధానికి ప్రతీక. ఈ పర్వ దినాన సోదరుడికి సోదరి రాఖీ కట్టడం అనవాయితీ. ఇలా రాఖీ కట్టేందుకు తమ సోదరుల దగ్గరకు వెళ్లే మహిళలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఉచితంగా ఆటో సేవలందిస్తున్నాడు జితేంద్ర ఖాథీక్​ అనే వ్యక్తి.

ఉచిత ప్రయాణం

By

Published : Aug 16, 2019, 6:48 AM IST

Updated : Sep 27, 2019, 3:46 AM IST

దేశంలో పండుగలు అంటే కలిసికట్టుగా ఉండేందుకు, ఐక్యతకు నిదర్శనం. ఈ విషయాన్ని సరిగ్గా నిరూపించాడు ఛత్తీస్​గఢ్​కు చెందిన జితేంద్ర ఖాథీక్ అనే ఓ ఆటో డ్రైవర్​. రక్షాబంధన్​ సందర్భంగా మహిళలను ఉచితంగా వారి గమ్య స్థానాలకు చేర్చి సోదర భావాన్ని చాటాడు. ఇలా చేయడం జితేంద్రకు ఇది కొత్తేమి కాదు గత ఆరేళ్లుగా ప్రతీ రక్షాబంధన్​కు ఇలా ఉచితంగా సేవలందిస్తున్నాడితడు.

"రక్షాబంధన్​ నాడు చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటోలు నడపరు. ఈ సమయంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కారణంగా చాలా మంది మహిళలు వారి సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లలేక పోతారు. ఆలా జరగొద్దనే ఉద్దేశంతో నేను ఈ సేవ ప్రారంభించా." - జితేంద్ర ఖాథీక్, ఆటో డ్రైవర్​

ఇదీ చూడండి: మోదీ 'సీడీఎస్'​ నిర్ణయంపై ప్రశంసల జల్లు

Last Updated : Sep 27, 2019, 3:46 AM IST

ABOUT THE AUTHOR

...view details