తమిళనాడు కోయంబత్తూర్‌లో ఇద్దరు దుండగులు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. తమ ద్విచక్రవాహనాన్ని అధిగమించినందుకు ఆటో డ్రైవర్‌ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.
కీరనాథంలో ఆరుణ్ ప్రసాద్ అనే ఆటో డ్రైవర్‌కు, ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో ఇద్దరికి... ఓవర్టేక్ చేసే విషయంలో గొడవ మొదలైంది. కాసేపటికి అరుణ్ ఓ హోటల్ దగ్గర టీ తాగడానికి ఆటో ఆపాడు. వెంటనే అక్కడికి వచ్చిన దుండగులు... "మా వాహనాన్నే అధిగమిస్తావా" అంటూ వాదనకు దిగారు. ఘర్షణ తీవ్రరూపు దాల్చింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు... భవన నిర్మాణంలో ఉపయోగించే ఇనుప పనిముట్టుతో ఆటోడ్రైవర్‌ను చితకబాదారు. కొన ఊపిరితో ఉన్న అరుణ్‌ను అక్కడి వదిలేసి పారిపోయారు.