కర్ణాటకలో కరోనా భయంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా.. మరొకరు హఠాన్మరణం పొందారు.
భయంతో ఆత్మహత్య..
కరోనా ఉందేమోనని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య! దిండిగల్ జిల్లాకు చెందిన అజగరసామి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో స్థానిక వైద్యుడిని సంప్రదించాడు. కొద్ది రోజులు చికిత్స చేసినా, అజగరసామి కోలుకోకపోయేసరికి ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేశాడు ఆ వైద్యుడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ముందు అజగరసామిని కరోనా పరీక్షలు చేయించుకోమన్నారు. అంతే, తనకు కరోనా ఉందేమోనని భయం మొదలైంది. దీంతో ఆసుపత్రి నుంచి బయటకొచ్చాడు.
కరోనా సోకిందేమోనని గుబులుతో కళ్లరైతొట్టంలోని ఓ ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కాడు. విద్యుత్ తీగను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయాక నెగిటివ్...
కరోనా భయంతో ఆటో డ్రైవర్ హఠాన్మరణం కర్ణాటక, కలబురగి జిల్లా భవాని ప్రాంతానికి చెందిన అశోక(52) అల్లుడికి కరోనా సోకింది. జులై 8న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు అధికారులు. నమూనాలు తీసుకుని చాలా రోజులు గడిచినా పరీక్ష ఫలితాలు రాలేదంటే.. కరోనా లేదేమోనని ఊపిరి పీల్చుకున్నాడు అశోక. కానీ, ఉన్నట్టుండి శుక్రవారం కరోనా సోకిందని ఆరోగ్య శాఖ నుంచి ఫోన్ వచ్చింది. అంతే, అశోక అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించినప్పుడు కరోనా నెగిటివ్గా తేలింది.
ఇదీ చదవండి:కరోనా సోకిందని తలుపులకు స్టీల్ రేకులతో సీల్!