తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ అసాధ్యం'

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్​... ఆగస్టు 15 లోపు కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఓ వ్యాక్సిన్​ బయటకు వచ్చే ముందు అనేకమార్లు ప్రయోగాలు చేయాలని, దాని భద్రతపై మదింపు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అందువల్ల ఇంత తక్కువ సమయంలో ఓ వ్యాక్సిన్ రూపొందించడం కుదరదని పేర్కొంది.

Aug 15 target for COVID-19 vaccine launch 'unfeasible': Indian Academy of Sciences
'ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ సాధ్యం కాదు'

By

Published : Jul 6, 2020, 4:55 PM IST

ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించడం సాధ్యం కాదని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్​ (ఐఏఎస్​సీ) అభిప్రాయపడింది. ఇంత తక్కువ సమయంలో ఓ వ్యాక్సిన్ రూపొందించడం వాస్తవంలో కుదరదని స్పష్టం చేసింది.

ఐసీఎంఆర్​, భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేటు ఔషధ తయారీ సంస్థ కలిసి కరోనా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తున్నాయి. ఆగస్టు 15కల్లా దీనిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించాయి.

స్వాగతిస్తున్నాం.. కానీ

ఐసీఎంఆర్ కృషిని ఐఏఎస్​సీ స్వాగతించింది. ఈ వ్యాక్సిన్ త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని అభిలషించింది. కానీ ఇంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ రూపొందించడంపై సందేహాలు వ్యక్తంచేసింది.

"కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాక్సిన్ కనుగొనడం అత్యవసరమే. అయితే శాస్త్రీయ ప్రమాణాల విషయంలో రాజీపడడం కుదరదు. ఓ వ్యాక్సిన్ తయారుచేయాలంటే అనేక మార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అలాగే దాని భద్రతపై కచ్చితంగా మదింపు చేసి తీరాలి."

- ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్

ఐసీఎంఆర్ 'వ్యాక్సిన్' అభివృద్ధి ప్రక్రియ.. ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన నిబంధనలకు అనుగుణంగా లేదని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఇదీ చూడండి:డోభాల్​ ఎంట్రీతో చైనా సరిహద్దులో మారిన లెక్కలు

ABOUT THE AUTHOR

...view details