రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో దుమారం రేపిన ఆడియో టేపుల కేసులో హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ. టేపుల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు.
ఎమ్మెల్యేల కొనుగోలుతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నుతూ.. ఓ కేంద్ర మంత్రితో మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ కేసును రాజస్థాన్ పోలీసు ప్రత్యేక బృందం (ఎస్ఓజీ) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు శర్మ.