తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్ ఎమ్మెల్యే బలరాంకు భాజపా నోటీసులు - గుజరాత్ భాజపా

ఎన్సీపీ మహిళా నేత నీతూ తేజ్వానీపై దాడికి దిగిన గుజరాత్ ఎమ్మెల్యే బలరాం తవానీకి భాజాపా నోటీసులు జారీచేసింది. తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. బాధిత మహిళతో సమావేశమై క్షమాపణలు తెలిపినట్లు వెల్లడించారు. ఘటనపై వివరణ ఇవ్వాలని భాజపా నోటీసులు జారీచేసింది.

మహిళపై దాడిచేసిన ఎమ్మెల్యేకు భాజపా నోటీసులు

By

Published : Jun 3, 2019, 8:26 PM IST

ఎన్సీపీ మహిళా నేతపై దాడి వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఎమ్మెల్యే బలరాం తవానీకి భాజపా నోటీసులు జారీ చేసింది. మహిళపై ఎమ్మెల్యే బలరాం దాడి వీడియో వైరల్​గా మారింది.

మహిళా నేతపై తాను చేసిన దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు భాజపా గుజరాత్ ఎమ్మెల్యే బలరాం తవానీ. బాధిత మహిళతో సమావేశమై క్షమాపణలు తెలిపారు ఎమ్మెల్యే. తప్పును అంగీకరిస్తున్నానని, కావాలని చేసిన పని కాదని స్పష్టం చేశారు. తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురుకాలేదన్నారు.

ఎమ్మెల్యేతో భేటీ అనంతరం ఎన్సీపీ మహిళా నేత వ్యాఖ్యలు

"ఆయన నన్ను సోదరిగా భావించేవాణ్నని అన్నారు. సోదరిగా భావించే చెంపదెబ్బ కొట్టానన్నారు. ఆయనకు దురుద్దేశాలు లేవని చెప్పారు. ఆయనను నేనూ సోదరుడిగానే భావిస్తున్నాను. ఇద్దరం రాజీ పడ్డాం."

-నీతూ తేజ్వానీ, బాధిత మహిళ

స్థానికంగా ఉన్న సమస్యలను తెలిపేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన ఎన్సీపీ మహిళా నేత నీతూ తేజ్వానీపై దాడికి దిగారు ఎమ్మెల్యే బలరాం.

ఎమ్మెల్యే దాడి వీడియో

ఇదీ చూడండి: 'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

ABOUT THE AUTHOR

...view details