భారత మాజీ క్రికెటర్, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా ఈసీకి లేఖ రాశారు ఆప్ నేత అటిషి మర్లేనా. 72 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని లేఖలో కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గత మూడు రోజుల్లోనే గంభీర్ రెండు సార్లు ఉల్లంఘించారని ఆరోపించారు.
శనివారం రోజు జాంగ్పురాలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభ నిర్వహించినందుకు గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
''మొదటి ఉల్లంఘన కింద గంభీర్‌పై ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా ఎలాంటి మార్పు లేదు. ఆయన అదే పునరావృతం చేస్తున్నారు. ఈసీని పట్టించుకోట్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నా. 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉంచాలి.''