తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ మహిళా కమిషన్​లో గంభీర్​పై ఫిర్యాదు - Gambhir

భాజపా నేత, మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్​పై దిల్లీ మహిళా కమిషన్​లో ఫిర్యాదు చేశారు ఆమ్​ ఆద్మీ పార్టీ నేత అతిశి. తనపై అభ్యంతర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలు పంచినందుకు భాజపాతో పాటుగా గంభీర్​ బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

దిల్లీ మహిళా కమిషన్​లో గంభీర్​పై ఫిర్యాదు

By

Published : May 11, 2019, 6:59 AM IST

Updated : May 11, 2019, 7:25 AM IST

దిల్లీ మహిళా కమిషన్​లో గంభీర్​పై ఫిర్యాదు

మాజీ క్రికెటర్​, భాజపా నేత గౌతమ్​ గంభీర్​, ఆమ్​ ఆద్మీ పార్టీ నేత అతిశి మధ్య అభ్యంతర కరపత్రాల వ్యవహారం రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. విమర్శల పర్వం దాటి తాజాగా దిల్లీ మహిళా కమిషన్​ను చేరింది. గంభీర్​ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను పంచారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై భాజపాతో పాటుగా గంభీర్​ బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు అతిశి. ఈ వ్యవహారానికి వీరు తప్ప మిగతా వారెవరూ కారణం కాదని దిల్లీ మహిళా కమిషన్​లో ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా పంచిన కరపత్రాలను జతచేస్తూ అధికారులకు లేఖను అందజేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

" ఈ వ్యవహారంలో అన్ని కోణాల్లోనూ పూర్తి స్వతంత్ర దర్యాప్తు జరిగేలా మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని ఈ లేఖ రాస్తున్నాను. మోసపూరిత వ్యక్తులపై నేను చేస్తోన్న ఈ యుద్ధంలో నాకు తోడుగా నిలవమని మిమ్మల్ని కోరుతున్నాను."
- అతిశి, ఆప్​ అభ్యర్థి

తనపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను గంభీర్​ ప్రజలకు పంచి పెట్టారని ఆమ్​ఆద్మీ తూర్పు దిల్లీ అభ్యర్థి అతిశి గురువారం ఆరోపించారు. మీడియా ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయంపై అరవింద్​ కేజ్రివాల్​ ట్వీట్​ చేశారు. గంభీర్​ ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారని ఊహించలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆప్​ నేతలు గంభీర్​పైన విమర్శలు చేశారు.

వీటిపై గంభీర్ ఇదివరకే స్పందించారు​. అతిశిని.. అవమానించేలా అభ్యంతరకరమైన కరపత్రాలను తాను పంచినట్టు రుజువు చేస్తే బహిరంగంగా ఉరేసుకుంటానన్నారు. అవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టి పారేశారు. తనకు మహిళలంటే ఎంతో గౌరవమని, వారిని అవమానించేలా ఏ పని చేయలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : 'పాక్​ నుంచి వచ్చిన విమానంతో ప్రమాదేమేమీ లేదు'

Last Updated : May 11, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details