తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవిత్రయుద్ధం మూర్ఖత్వం..జీహాద్​పై కశ్మీరీల ఆగ్రహం!

పవిత్రయుద్ధం చేస్తున్నామంటూ ప్రకటించుకునే ఉగ్రవాదుల చర్యలు రోజురోజుకూ పాశవికంగా మారుతున్నాయి. బందిపొర జిల్లా హజిన్​లో  12 ఏళ్ల బాలుడు అతిఫ్ మహ్మద్ మీర్​ను అతికిరాతకంగా పొట్టన బెట్టుకున్నారు లష్కరేతయిబా ముష్కరులు. గ్రామస్థులంతా కలిసి వేడుకున్నా కనికరించలేదు.

సైనికులు.. ప్రతీకాత్మక చిత్రం

By

Published : Mar 22, 2019, 11:34 PM IST

దక్షిణ కశ్మీర్​లోని బందిపొర జిల్లా హజీన్​లో తనిఖీలు చేస్తోన్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు ముష్కరులు. బదులుగా బలగాలు దీటుగా స్పందించాయి. సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఓ ఇంట్లోకి దూరిన దుండగులు తుపాకులతో బెదిరించి ఆ ఇంట్లో వారిని రక్షణ కవచంలా వాడుకున్నారు.

ఇదేం పైత్యం

ఆ ఇంట్లోని ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి యత్నించారు. కుటుంబసభ్యుల సహాయంతో ఎలాగోలా తప్పించుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆగ్రహించిన ముష్కరులు కుటుంబాన్ని చిత్రహింసలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా ఆ కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నించారు. కష్టపడి కుటుంబాన్ని మొత్తం బయటకు తీసుకురాగలిగారు.

కానీ ఉగ్రవాదుల చెరలో ఓ బాలుడు చిక్కుకుపోయాడు. పోలీసులు ముందుగా బాలుడిని విడిచి పెట్టాలని హెచ్చరించారు. కానీ ఉగ్రవాదులు ఖాతరు చేయలేదు. అనంతరం ఆ గ్రామ పెద్ద బాలుడిని విడిచి పెట్టాలని దీనంగా వేడుకున్నాడు. కానీ కరుడుగట్టిన ముష్కరులు కించిత్​ కూడా కనికరించలేదు. అత్యంత పాశవికంగా 12ఏళ్ల ఆతిఫ్ మహ్మద్ మీర్​ను పొట్టనబెట్టుకున్నారు.

కమాండోల గుళ్ల వర్షం

బాలుడిని హతమార్చిన ఉగ్రవాదులకు తప్పించుకునే దారి లేకపోయింది. వెనువెంటనే ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి భద్రతా బలగాలు. తూటాల వర్షంతో ఆ ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టారు జవాన్లు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో బాలుడ్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

ABOUT THE AUTHOR

...view details