తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రంలో భాజపా  మిత్రపక్షాల ప్రతినిధి ఆయనొక్కరే - Breaking news

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో.. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల నుంచి ప్రస్తుతం ఒక్క మంత్రి మాత్రమే ఉన్నారు. మోదీ 2.0 ప్రభుత్వంలో నలుగురు భాజపాయేతర సభ్యులకు మంత్రివర్గంలో చోటుదక్కగా.. ఇద్దరు రాజీనామా చేశారు. ఇప్పుడు పాసవాన్​ మృతితో మిత్రపక్షాల నుంచి ఒకే ఒక్క మంత్రి మాత్రమే ప్రాతినిధ్య వహిస్తున్నారు.

Athawale sole representative of NDA allies in Modi govt after Paswan's demise
మోదీ 2.0 సర్కార్​ ఎన్డీయేతర మంత్రుల్లో మిగిలింది అథవాలేనే!

By

Published : Oct 9, 2020, 8:06 PM IST

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు కొద్దికాలంగా మిత్రపక్షాలు దూరమవుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి పాసవాన్​ మృతితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో.. మిత్రపక్షాల నుంచి ఒక్క మంత్రే మిగిలారు. అది రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియాకు చెందిన రాందాస్​ అథవాలే.

రాందాస్​ అథవాలే, కేంద్ర మంత్రి

అయితే.. కేంద్ర కేబినెట్​లో భాజపా మిత్రపక్షాలేవీ ఇప్పుడు లేవు. అథవాలే.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

2019లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం.. మిత్రపక్షాల నుంచి అర్వింద్​ సావంత్​(శివసేన), హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​(శిరోమణి అకాలీ దళ్​), రామ్​ విలాస్​ పాసవాన్​(లోక్​ జన్​శక్తి పార్టీ)లకు కేంద్ర కేబినెట్​లో చోటు దక్కింది.

ఒక్కొక్కరుగా బయటకు..

2019 చివర్లో శివసేన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆగ్రహంతో శిరోమణి అకాలీ దళ్​ కూడా తెగదెంపులు చేసుకుంది. మరో ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్​(యునైటెడ్​) కేంద్ర ప్రభుత్వంలో భాగంగా లేదు.

ఇదీ చూడండి:ఎన్డీఏతో అకాలీదళ్​ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్​

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మొత్తం 57 మంది 2019 మే 30న కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో 24 మందికి కేబినెట్​ హోదా ఉంది. వీరిలో సావంత్​, బాదల్​ రాజీనామా చేశారు. అక్టోబర్​ 8న పాసవాన్​ మృతిచెందారు. ఇప్పుడు కేబినెట్​లో 21 మంది మంత్రులు మాత్రమే మిగిలారు. అందులో రాందాస్​ అథవాలే మిత్రపక్షాల ఏకైక ప్రతినిధిగా ఉన్నారు.

ఇదీ చూడండి: పాసవాన్​ మృతితో బిహార్​ ఎన్నికలపై భారీ ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details