తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11 ఏళ్ల వయస్సులోనే ఆ బాలిక అరుదైన ఘనత - గుజరాత్​ సూరత్కు చెందిన సిద్ధి

గుజరాత్​ సూరత్​లో 6వ తరగతి చదువుతున్నసిద్ధి అనే బాలిక ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించుకుంది. చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన బాలికగా నిలిచింది. అంతేకాకుండా గుజరాత్​ ప్రభుత్వం నిర్వహించిన ఓ పోటీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

At the young age of 11, Siddhi's name was included in the India Book of Records
ఇండియన్ బుక్ ఆఫ్​ రికార్డ్స్​లో 11 ఏళ్ల బాలిక స్థానం

By

Published : Sep 9, 2020, 8:52 AM IST

గుజరాత్​కు చెందిన సిద్ధి పటేల్​ అనే బాలిక అరుదైన ఘనత సాధించింది. 11 ఏళ్ల వయస్సులో ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది. సూరత్​ నుంచి అతి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన బాలికగా నిలిచింది. ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది.

మెడల్​ చూపిస్తున్న సిద్ధి
బుక్​ ఆఫ్ రికార్ఢ్సు అందించిన మెడల్​

పిరమిడ్ నిర్మాణం..

ప్లాస్టిక్​ గ్లాసులతో 23 అంతస్తుల పిరమిడ్​ నిర్మాణాన్ని చేపట్టాలనుకుంది సిద్ధి. ఈ క్రమంలోనే 15వ అంతస్తు పూర్తి చేస్తుండగా గ్లాసులు పడిపోతున్నాయి. ఎన్ని సార్లు ప్రయత్నించినా అలాగే జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం చేసింది సిద్ధి. ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత తన శ్వాస నుంచి వచ్చే గాలి వల్ల గ్లాసులు పడిపోవటాన్ని గుర్తించింది. దీంతో శ్వాసను అదుపులో ఉంచుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం ప్రాణయామంపై అధ్యయనం చేసి చివరకు పిరమిడ్​ను పూర్తి చేసింది.

పిరమిడ్​ను తయారు చేస్తున్న సిద్ధి
సిద్ధి

ఏప్రిల్​ నెలలో గుజరాత్​ ప్రభుత్వం 'స్టే హోం స్టే సేఫ్​', ' రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం ఎలా?' అనే కొవిడ్​-19కు చెందిన రెండు అంశాలపై 'టూ మినిట్స్​ ఇన్నోవేటివ్​ వీడియో కాంపిటిషన్'​ను నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న సిద్ధి ఈ రెండు అంశాలపై తన ప్రదర్శననిచ్చింది. దీనిలో సిద్ధి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇండియన్ బుక్ ఆఫ్​ రికార్డ్స్​ పత్రం

ABOUT THE AUTHOR

...view details