ఐక్యతా విగ్రహానికి అందాలు అద్దిన ముళ్ల పొదలు! ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహానికి సరికొత్త కళ వచ్చింది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాక్టస్ మొక్కల ఉద్యానవనం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
గిర్ ఫౌండేషన్ చొరవతో నర్మదా నది ఒడ్డున కాక్టస్ పార్క్‌ను 836 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో ఉన్న జెముడు జాతి మొక్కలు.. వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఈ మొక్క ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని బతకగలదు. సహజంగా పొడిబారిన నేలలో పెరిగే ఈ మొక్కలు... ప్రపంచంలో అత్యంత ఎడారి ప్రాంతమైన అటకామాలో విరివిగా లభిస్తాయి. ఐక్యతా విగ్రహం వద్ద పూల ఉద్యానవనానికి ఎదురుగా ఉన్న ఈ పార్కులో ప్రస్తుతం 400కు పైగా కాక్టస్ జాతి మొక్కలు పెరుగుతున్నాయి. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా పేరుగాంచి.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. సర్దార్ పటేల్ స్మారకార్థంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని నిర్మించింది. అంతటి మహోన్నతమైన ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసిందీ కాక్టస్ గార్డెన్.
ఇదీ చూడండి:శబ్దాలు చేసేవి కావు.. ఇవి నోరూరించే టపాకాయలు!