టోల్బూత్ను లేపేసి.. బైక్ను ఢీకొట్టిన లారీ
వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ అదుపు తప్పింది. టోల్బూత్ను ధ్వంసం చేసింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.
ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు.. చిన్న పిల్లలు కూర్చున్న ఓ బైక్ ఆ ప్రమాద ప్రదేశంలో ఉంది. అయితే.. అదృష్టవశాత్తు ఒక్క క్షణం ముందు ఆ వాహనం ముందుకు వెళ్లడం వల్ల చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.