సరిహద్దు జిల్లాల్లో వరదలను అరికట్టేందుకు నేపాల్ సహకరించటం లేదని ఆరోపించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. నేపాల్ నుంచి వచ్చే నదులు ఉప్పొంగి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వరదల పరిస్థితి, సన్నద్ధతపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నేపాల్ అంశాన్ని లేవనెత్తారు నితీశ్. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు.