తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశీ వ్యవహారాల శాఖలో కరోనా కలకలం! - విదేశీ వ్యవహారాల శాఖలో కరోనా కేసులు

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ)లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దిల్లీలోని ఎంఈఏ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు సిబ్బందికి కరోనా నిర్ధరణ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగా వారితో సన్నిహితంగా మెలిగిన ఇతర ఉద్యోగులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎంఈఏ ఆదేశించినట్లు తెలుస్తోంది.

cavid cases in Mea
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కరోనా కేసులు

By

Published : May 30, 2020, 2:47 PM IST

దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయింది. ఎంఈఏలోని న్యాయ విభాగంలో పని చేస్తోన్న ఒక ఉద్యోగి సహా సెంట్రల్ యూరప్ విభాగానికి చెందిన కన్సల్టెంట్​కు ఈ వారం ప్రారంభంలో కొవిడ్ నిర్ధరణ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూరప్ విభాగంలోని దాదాపు మొత్తం సిబ్బంది, న్యాయ విభాగంలోని పెద్ద సంఖ్యలో ఉద్యోగులను 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు తెలుస్తోంది.

మెడికల్ డైరెక్టర్​కూ కరోనా..

దిల్లీలో కరోనా చికిత్స అందిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఎల్​ఎన్​జేపీ హాస్పిటల్​.. మెడికల్ డైరెక్టర్​ సురేశ్​ కుమార్​కూ కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో మరో ఇద్దరు సిబ్బందికీ కొవిడ్​ నిర్ధరణ అయినట్లు శనివారం పేర్కొన్నారు. మే 17నే మెడికల్ డైరెక్టర్​గా సురేశ్​ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి:సాయం అందించబోతే.. తల తెగిపోయింది!

ABOUT THE AUTHOR

...view details