ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు జీ-7 సమావేశాలకు ప్రత్యేక అతిథిగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా పునర్వినియోగానికి పనికారని ప్లాస్టిక్‌ను భారత్ నుంచి తొలగించేందుకు చేపడుతున్న చర్యలను వివరించినట్లు భారత విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, వృక్ష- జంతు సంపద కాపాడుకునేందుకు అనుసరిస్తోన్న విధానాలను జీ-7 సదస్సులో మోదీ వినిపించినట్లు రవీస్ పేర్కొన్నారు.