భారత్లో 9నెలల కాలంలో(మార్చి11-డిసెంబర్16) అత్యధికంగా 2కోట్లకుపైగా శిశువులు జన్మిస్తారని అంచనా వేసింది యూనిసెఫ్. కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన మార్చి 11 నుంచి 9 నెలల పాటు జరగబోయే ప్రసవాలపై ఈమేరకు నివేదిక రూపొందించింది.
అయితే కరోనా వైరస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తల్లీబిడ్డలకు ఆరోగ్య సేవలు అందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించింది యూనిసెఫ్.
ప్రపంచవ్యాప్తంగా...
ఈ 9నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 60 లక్షల మంది జన్మిస్తారని అంచనా. అత్యధికంగా భారత్లో 20.1 మిలియన్ మంది ప్రసవిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(13.5మిలియన్), నైజీరియా(6.4మిలియన్), పాకిస్థాన్(5 మిలియన్), ఇండోనేషియా(4మిలియన్) ఉన్నాయి.