దేశంలో కరోనా కేసుల భారీ పెరుగుదలలో లక్షణాలు లేని వ్యక్తుల పాత్ర గురించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నివేదించింది. వ్యాధి సంక్రమణతో పాటు రెండోసారి వ్యాప్తిలోనూ వీరి భాగస్వామ్యం కూడా అధికంగా ఉన్నట్లు పేర్కొంది.
"బలమైన ఆధారాలు ఉంటే తప్ప మాస్కుల వినియోగం తప్పనిసరి చేసి, ఇతర ప్రజారోగ్య చర్యలు చేపట్టే అవకాశం లేదు. కరోనా ప్రారంభ దశలో.. ఇది రెండోసారి వ్యాపించే జబ్బు కాదని భావించారు. కానీ, తాజా అధ్యయనాలను బట్టి వైరస్ మళ్లీ సోకే అవకాశం ఉందని తెలుస్తోంది" అని ఐసీఎంఆర్ పేర్కొంది.
సాధారణ జనాభాలో సంక్రమణ, రోగనిరోధక శక్తి పరిధిని అంచనా వేయటం సంక్లిష్టమని ఐసీఎంఆర్ పేర్కొంది. స్విట్జర్లాండ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉన్నా జెనీవా ప్రజలు కరోనా బారిన పడలేదని సెరో నివేదికలు వెల్లడించాయని వివరించింది. ఇలాంటి నివేదికలతో ఏర్పడిన గందరగోళం మధ్య రెండో దశ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అంతేకాకుండా, కరోనాకు ఎలాంటి ఔషధం లేదని, ప్రస్తుతం లక్షణాల చికిత్స కోసం వివిధ మందులను ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది ఐసీఎంఆర్.
ఇదీ చూడండి:కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో 6,324 కేసులు