ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను స్పుత్నిక్-వీ టీకా డోసులతో కలిపి ప్రయోగించాలని రష్యాకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ చేసిన సూచనను ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ మేరకు రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి(ఆర్డీఐఎఫ్) శుక్రవారం తెలిపింది.
ఈ తాజా పరిశోధన ద్వారా ఆస్ట్రాజెనెకా శాస్త్రవేత్తలకు తమ టీకా సామర్థ్యం పెంచేందుకు ఉపకరిస్తుందని గమలేయ పరిశోధన సంస్థ చెప్పింది. ఈ ఏడాది చివరికల్లా ఈ క్లినికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. స్పుత్నిక్-వీ టీకా డోసులతో కలిపి ప్రయోగించాలని ఆస్ట్రాజెనెకాకు నవంబర్ 23న 'గమలేయ' సూచించింది.
ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పుణెలోని సీరం సంస్థ 'కొవిషీల్డ్' పేరుతో వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను అభివృద్ధి చేస్తోంది.