తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌర ఎఫెక్ట్​: అసోం పర్యటకానికి 1000 కోట్లు నష్టం - ASSAM TOURISM

పౌర నిరసనల వల్ల అసోం పర్యటక రంగం భారీగా దెబ్బతింది. దాదాపు వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేసేందుకు ఆ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ ప్రణాళికలను రచిస్తోంది.

Assam tourism hit hard by anti-CAA protests, loses Rs 1,000 cr
అసోం పర్యటకానికి 1000 కోట్లు నష్టం

By

Published : Jan 1, 2020, 6:31 AM IST

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అసోంలో పౌర నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. దీని వల్ల ఆ రాష్ట్ర పర్యటక రంగం తీవ్రంగా దెబ్బతింది. పౌర నిరసనలతో దాదాపు 1,000 కోట్ల నష్ట్రం అంచనా వేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.

అసోం పర్యటక రంగానికి డిసెంబర్​- మార్చి మధ్య కాలం ఎంతో ముఖ్యం. మొత్తం ఏడాదిలో 48శాతం లబ్ధి ఈ నెలల నుంచే పొందుతుంది అసోం పర్యటక అభివృద్ధి సంస్థ(ఏటీడీసీ). కానీ పౌర నిరసనల వల్ల డిసెంబర్​లో పర్యటకుల సంఖ్య భారీగా తగ్గిందని.. జనవరిలోనూ ఇదే కొనసాగే అవకాశముందని అభిప్రాయపడింది.

డిసెంబర్​ 11 నుంచి హొటల్​ పరిశ్రమలు కూడా భారీగా నష్టపోయాయి. 15 రోజుల్లో రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది.

దేశీయ పర్యటకులతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్యా భారీగా పడిపోయింది. భారత్​లో పర్యటించాలంటే జాగ్రత్త వహించాలని ఆయా దేశాలు సూచించడం కూడా ఇందుకు ఓ కారణం.

"శాంతియుత నిరసనల వల్ల పెద్దగా ప్రభావం పడదు. కానీ హింసాయుత ఆందోళనలు చాలా నష్టం కలిగిస్తాయి. ఈ ఏడాది 65 లక్షలమంది స్వదేశీయులు, 50వేల మంది విదేశీయులు రాష్ట్రంలో పర్యటిస్తారని అంచనా వేశాం. కానీ డిసెంబర్​, జనవరి నెలల్లో 80శాతం బుకింగ్స్​ రద్దయ్యాయి. ఫిబ్రవరిలో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం."
--- జయంత్​ బరౌహ్, ఏటీడీసీ ఛైర్మన్​.​

దెబ్బతిన్న పర్యటక వ్యవస్థను గాడిన పడేయడానికి ఏటీడీసీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో రోడ్​షోలు నిర్వహించి స్వదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విదేశీ పర్యటకుల కోసం సూచనలు జారీ చేసిన దేశాల(ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్​)తో సంప్రదింపులు జరపనుంది.

ఇదీ చూడండి:- నేటి అర్ధరాత్రి నుంచి కశ్మీర్​లో అంతర్జాల నిషేధంపై సడలింపు

ABOUT THE AUTHOR

...view details