2,605 దగ్గర ప్రారంభమైన వేలం ప్రపంచ రికార్డును సృష్టించింది. వేలంపాటలో పెట్టిన రెండు కిలోల టీ పొడి మొత్తాన్ని బెల్జియంకు చెందిన ఓ వ్యక్తి కోసం అసోంకు చెందిన ముంద్ర కంపెనీ కొనుగోలు చేసింది.
అసోం కంపెనీ దేశంలోనే పురాతనమైన టీ కంపెనీల్లో ఒకటి. 1849లో ప్రారంభించిన ఈ సంస్థకు రవీంద్రనాథ్ ఠాకూర్ కూడా ప్రమోటర్‌గా పని చేశారు.
మైజాన్ గోల్డెన్ టిప్స్ టీ పూర్తిగా చేత్తో తయారు చేసినవే. యంత్రాలు అస్సలు వాడలేదని ఆ కంపెనీ సీఈఓ విజయ్‌సింగ్ తెలిపారు.
రికార్డు ధర పలికిన అసోం వెరై'టీ' - maijan_tea
తలనొప్పిగా ఉంటే అల్లం చాయ్. సరదాగా కాసేపు స్నేహితులతో ముచ్చటించాలంటే ఇరానీ చాయ్. పని ఒత్తిడి ఎక్కువైనట్టు అనిపిస్తే రెండు నిమిషాల చాయ్ టైం. ఉపశమనం కలిగేందుకు, ఉత్సాహం నింపేందుకు మన జీవితాల్లో ఓ భాగమైంది టీ. ప్రపంచంలోని అన్ని రకాల వెరైటీ టీలు తాగాలని తాపత్రయపడేవారు ఎందరో. అందుకే అసోంలో దొరికే ప్రత్యేకమైన టీ కిలో 70,501 రూపాయల ధర పలికింది.
"ఇన్ని రికార్డులు సొంతం అవ్వడం అసోం కంపెనీకి గౌరవప్రదమైనది. స్వచ్ఛత పాటించే పరిశ్రమలకూ గౌరవప్రదమైనది. మా ఛైర్మన్ డా.బిహానీ శెట్టి తరఫున నేను కంపెనీ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అసోం కంపెనీకి 14టీ తోటలున్నాయి. టీ మొక్కలు పెట్టిన చోట 50 ఏళ్ల తర్వాత దిగుబడి సామర్థ్యం తగ్గుతూపోతుంది. అందుకే దిగుబడిని స్థిరంగా ఉంచేందుకు రెండేళ్లకు ఓ సారి కొత్త మొక్కలు పెడుతుంటారు. కానీ మేము కొన్ని చాయ్‌లు వందేళ్ల పురాతన మొక్కల నుంచే తయారు చేస్తున్నాం.
ప్రభుత్వం కూడా కాలంతోపాటు టీ పరిశ్రమలకు సంబంధించిన పాలసీలను మారుస్తూ ఉండాలి. అప్పుడే అసోం టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలం."
-దినేశ్ బిహానీ, సెక్రెటరీ-టీ ఆక్షన్ బయర్స్ అసోసియేషన్.
ఇదీ చూడండి:తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి