తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనుమానిత ఉగ్ర దాడిలో జవాను మృతి - అరుణాచల్ ప్రదేశ్ న్యూస్​

అరుణాచల్ ప్రదేశ్​లో జరిగిన అనుమానిత ఉగ్రదాడిలో జవాను ప్రాణాలు కోల్పోయాడు. చంగ్లాంగ్‌ జిల్లా హెట్లాంగ్‌ గ్రామంలో నీళ్ల ట్యాంకర్​ను తీసుకెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగింది.

Assam-Rifles-jawan-killed-in-Arunachal-ambush
అనుమానిత ఉగ్ర దాడిలో జవాను మృతి

By

Published : Oct 5, 2020, 4:34 AM IST

అరుణాచల్‌ప్రదేశ్‌లోని చంగ్లాంగ్‌ జిల్లాలో జరిగిన దాడిలో ఓ జవాన్‌ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. జైరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హెట్లాంగ్‌ గ్రామంలో ఆదివారం ఉదయం నీళ్ల ట్యాంకర్‌ను తీసుకెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.

చంగ్లాంగ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ దేవాన్ష్‌ యాదవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 19వ అసోం రైఫిల్స్‌కు చెందిన ఓ నీటి ట్యాంకర్‌ హెట్లాంగ్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మొదట అక్కడ బాంబు పేలుడు జరిగినట్లు తమకు సమాచారం వచ్చింది.. కానీ పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చే వరకు అది బాంబు దాడిగా నిర్ధారించలేమని చెప్పారు. జవాన్‌ మరణానికి మాత్రం బుల్లెట్‌ గాయాలే కారణమన్నారు. గాయపడిన జవాన్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ దాడికి బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకోలేదు. యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ లేదా ఎన్‌ఎస్‌సీఎన్‌ కే దళాలు ఈ కుట్రకు తెగబడినట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details