కేరళ కొల్లాం జిల్లాలో ఓ వలస కూలీ అబ్దుల్ అలీ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సమీప బంధువు జలాలుద్దీన్, మరో స్నేహితుడిని కత్తితో నరికి చంపాడు. ఆపై వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడీ కిరాతకుడు.
ఉదయం సమయంలో గేటుకు తాళాలు వేసిన అలీ.. గదిలో ఉన్న స్నేహితుడు, బంధువుపై కత్తితో దాడి చేశాడు. వారి అరుపులు విని వచ్చిన ఇద్దరు వ్యక్తులను కత్తితో బెదిరించటం వల్ల వారు భయపడి పారిపోయారు.